‘థాయ్‌’ సింహాసనంపై వజిరాలాంగ్కార్న్

‘థాయ్‌’ సింహాసనంపై వజిరాలాంగ్కార్న్

బ్యాంకాక్ : థాయ్లాండ్ రాజు వజిరాలాంగ్కార్న్ పట్టాభిషేకం శనివారం ఇక్కడ అత్యంత వైభవంగా జరిగింది. తొమ్మిది అంచెల గొడుగు కింద రాజును కూర్చోబెట్టి పట్టాభిషేకం చేశారు. తలపై ఏడు కిలోల కంటే ఎక్కువ బరువున్న బంగారు కిరీటాన్ని రాజు ధరించారు. క్వీన్ ఎలిజబెత్ కిరీటం కంటే ఇది ఏడు రెట్లు బరువైందని థాయ్ రాజు కుటుంబీకులు తెలిపారు. వైదిక, బౌద్ధ సాంప్రదాయాల ప్రకారం రాజు పట్టాభిషేకం జరిగింది. వేడుకలను చూసేందుకు బ్యాంకాక్ వీధులన్నీ జనంతో నిండి పోయాయి.పట్టాభి షేకానికి ముందు భారత్, థాయిలాండ్ లోని తొమ్మిది నదుల నుంచి సేకరించిన జలాలతో శుద్ధీకరణ తతంగాన్ని జరిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos