కరోనా పరీక్షల్లో చతికిల బడ్డ భారత్‌

కరోనా పరీక్షల్లో  చతికిల బడ్డ భారత్‌

న్యూఢిల్లీ : పరీక్షలు, పరీక్షలు, పరీక్షలు జరపండీ! కరోనా వైరస్పై యుద్ధం చేయడానికి ఇదే అసలైన, అవసరమైన మార్గం. అయినా భారత్ దీన్ని పెద్దగా పట్టించుకో లేదు. మార్చి 23 వరకూ భారత్లో కేవలం 18,383 మందికి పరీక్షలు నిర్వహించి 433 మందికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. మహా రాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లోనే దాదాపు యాభై శాతం కేసులు దాఖలయ్యాయి. మార్చి 18కి ఇటలీలో 1,65,541 మందికి, దక్షిణ కొరియాలో 2,95,647 మందికి పరీక్షలు నిర్వహించారు. దక్షిణ కొరియా ప్రతి రోజూ 20 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తోంది. భారత్ కరోనా పరీక్షలు ఇంత తక్కువ స్థాయిలో ఉన్నట్లయితే అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని పుణేకు చెందిన ‘గ్లోబల్ హెల్త్, బయోటిక్స్, హెల్త్ పాలసీ’ రిసర్చర్ అనంత్ భాన్ హెచ్చరించారు.
.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos