సరిహద్దుల్లో ఉద్రిక్తత

న్యూ ఢిల్లీ: భారత్ – చైనా మధ్య సరిహద్దు వివాదం మరింత ముదిరే అవకాశాలున్నాయి. రెండు దేశాలూ తమ భూభాగాల్లో బలగాల్ని పెంచుకుంటున్నాయి. 2017లో డోక్లాం తరహా సమస్య తలెత్తే సంకేతాలు వెలువడుతున్నాయి. చైనా భూ భాగంలో దాదాపు 2000-2500 మంది సైనికులు మొహరించారు. భారత్ కూడా వివాదాస్పద పాంగాంగ్, గాల్వన్ ప్రాంతాల్లో వాస్తవాధీన రేఖ వెంట బలగాల్ని పెంచి, తాత్కాలిక మౌలిక వసతుల్నికల్పించినట్లు సైనికాధికారి ఒకరు చెప్పారు. చాలా ప్రాంతాల్లో రెండు వైపుల బలగాలు ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉన్నాయని కొందరు అధికారులు తెలిపారు. గత రెండు వారాల్లో గాల్వన్ లోయలో చైనా దాదాపు 100 తాత్కాలిక గుడారాలను ఏర్పాటు చేసుకొని తిష్ఠ వేసిందని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos