ఆలయాలపై ఆధిపత్యానికి పూజారుల ఆందోళన

ఆలయాలపై ఆధిపత్యానికి పూజారుల ఆందోళన

డెహరాడూన్: బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాల నిర్వహణ, ఆధ్యాత్మిక పర్యాటకం వివాదాలు చెలరేగాయి. ఆశయాల సాధనకు జూన్ 28 నుంచి ఆందోళన చేపట్టేందుకు పూజారులు సిద్ధమయ్యారు. ఏటా లక్షల మంది భక్తులు, పర్యాటకులు ఈ క్షేత్రాలను దర్శించి హుండీలకు భారీ విరాళాలు సమర్పిస్తారు గతంలో ఈ ఆలయాల నిర్వహణ, ఆర్థిక వ్యవహారాల్లో ఇక్కడి పురోహితులకు ప్రత్యేక స్థానం ఉండేది. 1939లో సంయుక్త ప్రావిన్సు గఢ్వాల్ హిందూ దేవాలయాల నిర్వహణను బద్రీనాథ్-కేదార్నాథ్ చట్టం ప్రకారం పర్యవేక్షక సమితి ఏర్పాటు చేసారు. దీన్ని అప్పట్లో పురోహితులు ఎదిరించారు. గట్టి ప్రతిఘటన వ్యక్తం కాక పోవటంతో ఎలాంటి మార్పులూ జరగ లేదు. కరోనా కారణంగా రెండేళ్లుగా ఆలయాలకు భక్తుల్ని అనుమతించక పోవటంతో పూజారులు, పాండాలు జీవనాధారాన్ని కోల్పోయారు. కొత్తగా ఏర్పాటు చేసిన తాత్కాలిక సమితి 53 దేవాలయాల సంప్రదాయ హక్కులను ఉల్లంఘించినట్లేనని పూజార్లు ఆరోపించారు. ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకే ప్రభుత్వం ఆలయాలన్నింటినీ ఒకే బోర్డు నిర్వహణ కిందకు తీసుకు వచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos