ట్రంప్ పై ఇంత ప్రేమా!!

ట్రంప్ పై ఇంత ప్రేమా!!

ఎన్ని అనుకున్నా తెలుగు రాష్ట్రాల ప్రజల తీరే వేరు.ఎప్పుడు ఎందుకు  ఎలా ఎవరిని అందలమెక్కిస్తారో అధఃపాతాళానికి తొక్కేస్తారో ఒక పట్టాన అర్థం కాదు.రెండ శతాబ్దాలు పాలించినా ధవళేశ్వరం వద్ద బ్రిడ్జి కట్టించాడని కాటన్‌దోరకు విగ్రహం పెట్టి నివాళులర్పించడం,రాష్ట్ర విభజనకు కారణమైన కేసీఆర్ కు ఫ్లెక్సీలు కట్టి.. పాలాభిషేకాలు చేయటం ఆంధ్రోళ్లు చేస్తుంటారు.తెలంగాణ ప్రజలు కూడా తక్కువేమి తినలేదు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్ మీద తమకున్న అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు.వైఎస్‌ జగన్‌ ఫ్లెక్సీలు.. హోర్డింగ్ లు ఇప్పుడు హైదరాబాద్ తో సహా పలు ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి. ఇక.. జగన్ జపం తెలంగాణ విపక్షాల్లో పెద్ద ఎత్తున వినిపిస్తోంది.ఇలా ఇతర రాష్ట్రాల నేతలను మాత్రమే ఇతర దేశాల అధ్యక్షులను సైతం అభిమానించే ప్రజలు కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కనిపిస్తారు.తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలంలో కొన్నె అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన కృష్ణ అనే ఇదే కోవకు చెందుతాడు.తెలుగు రాష్ట్రాలకు,దేశానికి అసలు ఈ ఖండానికే సంబంధం లేని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ఆరాధించడం చర్చనీయాంశమైంది.శుక్రవారం డొనాల్డ్‌ ట్రంప్  పుట్టినరోజుకావటంతో ఇంటి దగ్గర ట్రంప్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. తన అభిమానాన్ని చాటుకున్నాడు. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా గ్రామస్తులకు అన్నదానం ఏర్పాటు చేశాడు. కృష్ణ మాత్రమే కాదు.. ఆయన ఫ్యామిలీ మొత్తం ట్రంప్ ను దేవుడిగా ఆరాధిస్తుంటారు. వీరి తీరు స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షించిందని చెప్పాలి.   ట్రంప్ నేతృత్వం వహించే రిపబ్లికన్ పార్టీలోనూ ఈ స్థాయిలో అభిమానించి.. ఆరాధించే వారు ఉండరేమో? ఈ వీరాభిమాని గురించి ట్రంప్ కు తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో..?

తాజా సమాచారం

Latest Posts

Featured Videos