మహారాష్ట్రలో తెలుగు సాహిత్య అకాడమీ

మహారాష్ట్రలో తెలుగు సాహిత్య అకాడమీ

ముంబై : మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ స్థాపనకు మహారాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో మహారాష్ట్రలోని తెలుగు సాహితీవేత్తల దశాబ్దాల ఎదురుచూపులకు తెరపడింది. క్యాబినెట్ సమావేశంలో తెలుగు, బెంగాలీ, సంసృత సాహిత్య అకాడమీల ఏర్పాటుకు ఆమోదం లభించింది. తెలుగు సాహిత్య అకాడమీ ఏర్పాటు కోసం నిరుడు ఏప్రిల్లో వివిధ ప్రాంతాలకు చెందిన కవులు, రచయితలు, కళాకారులు మంత్రి సుధీర్ మునిగంటివార్కు వినతిపత్రం అందించారు. మహారాష్ట్ర ప్రభుత్వం చాలా ఏండ్లుగా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ తెలుగు భాషలో పాఠ్య పుస్తకాలు అందిస్తున్నది. మహారాష్ట్ర తెలుగు సా హిత్య అకాడమీ ఏర్పాటుపై తెలుగు ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos