మనవడి నిర్వాకానికి క్షమాపణ చెప్పిన హోంమంత్రి..

మనవడి నిర్వాకానికి క్షమాపణ చెప్పిన హోంమంత్రి..

 తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ చేసిన నిర్వాకంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.తెలంగాణ డీజీపీ పేరుతో రిజిస్టర్‌ అయిన వాహనంపై కూర్చొని హోంమంత్రి మనవడు,అతడి స్నేహితుడు పోలీసులను కించపరుస్తూ చేసిన టిక్‌టాక్‌ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.ఓ హిందీ చిత్రంలో పోలీసు ఉన్నతాధికారిని బెదిరించే వీడియోను అనుకరిస్తూ హోంమంత్రి మనవడు అతడి స్నేహితుడు చేసిన టిక్‌టాక్‌ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఐజీ స్థాయి అధికారిని నోరు అదుపులో పెట్టుకోవాలని లేదంటే పీక కోస్తా అనే డైలాగ్ ని హోం మినిస్టర్ మనవడు చెప్పడం వివాదాస్పదంగా మారింది. వీడియోపై డీజీపీ, ఏడీజీలు చర్చించినట్లు సమాచారం. పోలీసు వాహనం భద్రత నిమిత్తం హోం మంత్రికి కేటాయించినట్లు తెలిసింది. ఘటన వివాదాస్పదం కావడంతో.. మహమూద్ అలీ స్పందించారు.‘‘ మా కుటుండం ఓల్డ్ సిటీలో పెళ్లికి వెళ్లినప్పుడు సంఘటన చోటుచేసుకుంది. ప్రాంతానికి చెందిన యువకుడు వచ్చి టిక్ టాక్ చేద్దామని నా మనవడిని అడిగితే చేశాడు. ఇలాంటి వీడియోలు చేయడం తనకు అలవాటులేదు. సరదాగా మాత్రమే చేశాడు. వీడియో చూసి ముందు మేము కూడా షాక్ అయ్యాం. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చూసుకుంటాను ’’ అంటూ వివరణ ఇచ్చారు.. పోలీసు శాఖకు చెందిన అధికారిక వాహనంపై కూర్చొని ఇలా అభ్యంతరకరంగా వీడియో చిత్రించడం పట్ల నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఘటనను సీరియస్ గా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos