జగన్‌ను ఫాలో అవుతున్న కేసీఆర్‌!

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొన్ని విషయాల్లో ఒకరిని ఒకరు అనుసరిస్తున్నారు.అప్పుడప్పుడూ వ్యక్తిగత శెలవులు మినహా ప్రతీరోజూ విధులు నిర్వర్తించే పోలీసులకు వారంలో ఒకరోజు శెలవు ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.ప్రభుత్వ నిర్ణయంపై పోలీసులు హర్షం వ్యక్తం చేస్తుండగా ప్రజలు సైతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.దీంతో తెలంగాణలో కూడా పోలీసులకు వారంలో ఒక రోజు శెలవు ఇవ్వడానికి సీఎం కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం.అందుకు సంబంధించి కసరత్తులు మొదలుపెట్టిన కేసీఆర్‌ జిల్లాలు, కమిషనరేట్‌ల వారీగా అవకాశాన్ని బట్టి సిబ్బందికి వీక్లీ ఆఫ్ ఇవ్వాలనే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. తుదిదశలో ఉన్న పోలీసు నియామక ప్రక్రియ పూర్తయి, కొత్త సిబ్బంది విధుల్లో చేరిన తర్వాత వారాంతపు సెలవులను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులివ్వాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా పోలీసు శాఖలో డీఎస్పీ, ఆపై అధికారులు వారాంతపు సెలవులను తీసుకుంటారు.క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే సీఐ నుంచి కానిస్టేబుళ్ల వరకూ వీక్లీ ఆఫ్ సాధ్యం కాదు. దీనికి అనేక కారణాలు సాకుగా చూపిస్తుంటారు. సిబ్బంది కొరత, విధులు పెరిగిపోవడం లాంటి కారణాలతో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి వారాంతపు సెలవులు అమలు చేయడం సాధ్యం కాదని తేల్చేశారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పోలీసులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos