ఓడినోళ్లకే టికెట్లు..

త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తెలంగాణ కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువవడంతో శాసనసభ ఎన్నికల్లో ఓడిన నేతలనే లోక్‌సభ ఎన్నికల బరిలో దించడానికి టీపీసీసీ దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.తమ తమ శాసనసభ నియోజకవర్గాల్లోనే గెలువలేకపోయిన చతికిలబడ్డ నేతలు ఏడు శాసనసభ నియోజకవర్గాలు ఉంటే పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో గెలుస్తారా అనేది ప్రతీ ఒక్కరీకి కలుగుతున్న అనుమానం.సాధారణంగా గత ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులనే మరోసారి ఎన్నికల్లో అభ్యర్థులుగా బరిలో దించడానికి అన్ని పార్టీలు వెనకడుగేస్తాయి. అటువంటిది శాసనసభ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులనే లోక్‌సభ ఎన్నికల బరిలో దించడం ఎక్కడైనా చూసామా? ఇటువంటి చిత్రవిచిత్రాలు కేవలం వందేళ్ల చరిత్ర కలిగిఉన్నఒక్క కాంగ్రెస్‌ పార్టీలోనే చూస్తుంటాం.ఏచెట్టు లేనిచోట ముళ్లచెట్టే మహావృక్షమనే సూత్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ యథాతథంగా అనుసరిస్తున్నట్లుంది. ఇక కాంగ్రెస్‌ ప్రాథమికంగా దాదాపుగా ఖరారు చేసిన జాబితా ఇదేనట

1. నాగర్ కర్నూల్ – నాగం జనార్ధన్ రెడ్డి
2. భువనగిరి- పొన్నాల లక్ష్మయ్య
3.మెదక్-దామోదర రాజనర్సింహా
4.కరీంనగర్- పొన్నం ప్రభాకర్
5.ఆదిలాబాద్ – ఆత్రం సక్కు (ఆసిఫాబాద్ ఎమ్మెల్యే)
6.పెద్దపల్లి-విజయరమణరావు
7.సికింద్రాబాద్-సర్వే సత్యానారాయణ లేదా అంజన్ కుమార్ యాదవ్
8. మహబూబాబాద్- సీతక్క (ములుగు ఎమ్మెల్యే)
9. ఖమ్మం – రేణుక
10.నిజామాబాద్-మధుయాష్కీ
11. మల్కాజిగిరి -శ్రీశైలం గౌడ్ లేదా రేవంత్ రెడ్డి
12. నల్గొండ- కోమటిరెడ్డి వెంకటరెడ్డి 
13. హైదరాబాద్ – అజారుద్దీన్
14. మహబూబ్ నగర్- డీకే అరుణ లేదా రేవంత్ రెడ్డి

తాజా సమాచారం

Latest Posts

Featured Videos