తేజస్వీకి ముందే అభినందనలు

తేజస్వీకి ముందే అభినందనలు

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగట్బంధన్ గెలుపు ఖాయమని దాదాపు అన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. రాజకీయ వర్గాల్లో కూడా ఈ మాటే ప్రబలంగా వినిపిస్తోంది. దీంతో తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి కాబోతున్నారనే ఆనందం ఆర్జేడీ సహా ఆ పార్టీ అనుకూల వర్గాల్లో అమితానందాన్ని కలిగిస్తోంది. ఫలితాలకు ఒకరోజు ముందు, అంటే.. నవంబర్ 10న బిహార్ అసెంబ్లీకి ఫలితాలు వెలువడనుండగా నవంబర్ 9న తేజస్వీ పుట్టిన రోజు వచ్చింది. దీంతో తేజస్వీపై శుభాకాంక్షల వెల్లువ హోరెత్తుతోంది. ‘ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ అభినందనలు వస్తున్నాయి. ఈరోజు ఇండియా ట్విట్టర్ ట్రెండింగ్లో తేజస్వీ పేరు ప్రధానంగా వినిపించింది. ఈరోజు తేజస్వీ పుట్టినరోజు మాత్రమే కాకుండా, రేపే బిహార్ అసెంబ్లీ ఫలితాలు రాబోతుండడం.. పైగా సర్వేలు అన్నీ మహాకూటమికి అనుకూలంగా ఉండడంతో తేజస్వీ పుట్టినరోజుకు మరింత ఆదరణ లభించింది. ఇండియా టాప్ ట్రెండింగ్లో ఉన్న హ్యాష్ట్యాగుల్లో తేజస్వీ పేరుతోనే నాలుగు హ్యాష్ట్యాగ్లు సందడి చేశాయి. అందులో ‘‘ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్’’ అనే హ్యాష్ట్యాగ్ ప్రధానంగా కనిపించింది. తమ అభిమాన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు ముఖ్యమంత్రి కాబోతున్నారనే ఆభిలాషలో ఆ శుభాకాంక్షలు కూడా ముందుగానే చెప్పేస్తున్నారు నెటిజెన్లు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos