భాజపా జేబు సంస్థలైన సిబిఐ,ఇడి

భాజపా జేబు సంస్థలైన సిబిఐ,ఇడి

పాట్నా: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఇన్‌కమ్ టాక్స్ (ఐటీ) విభాగాలు భారతీయ జనతా పార్టీ ‘ఐటీ సెల్’గా దిగజారాయని బిఎస్పీ అధినేత మాయవతి చేసిన వ్యాఖ్యలను ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ శనివారం ఇక్కడ గట్టిగా సమర్ధించారు. మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏడు రాష్ట్ర ప్రభుత్వ చక్కెర మిల్లుల పెట్టు బడుల ఉపసంహరణలో జరిగిన అవకతవకల వల్ల రూ.1,179 కోట్ల మేర ఖజానాకు గండిపడిందని సీబీఐ శుక్రవారం ప్రాథమిక సమాచార నివేదిక నమోదు చేసింది. ప్రభుత్వ సంస్థలు భాజపా ‘జేబు సంస్థ’లుగా మారాయని ఆరోపించారు. తాను తప్పిదాలు చేస్తే తమ ఇంటిపై కూడా ఐటీ శాఖ దాడులు చేస్తుందంటూ ప్రధాని మోదీ ఇచ్చిన ప్రకటనను తేజస్వి ఎద్దేవా చేసారు. అమిత్‌షా కుమారుడు జే షా అవినీతికి పాల్పడినట్లు సాక్ష్యాలున్నా ఎందుకు ఇంత వరకూ విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు. ‘భాజపా క్లీన్ చిట్ ఇస్తే సరిపోతుందా? ఇంక విచారణ అనేది ఉండదా? మాయావతికి వ్యతిరేకంగానే దాడులు జరుగుతున్నాయి. మా కుటుంబం వ్యవహారంలోనూ ఇదే వ్యూహం అనుసరించారు. ఆయా రాష్ట్రాల్లో మహా కూటమిని ఎలాగైనా ఓడించాలనే కారణంతోనే ఇవన్నీ చేయిస్తున్నారు. మేము రాజ్యాంగాన్ని, వివిధ సంస్థలను కాపాండేదుకు పోరాటం చేస్తున్నాం. అయితే, సీబీఐ, ఈడీ, ఐటీలు మాత్రం భాజపా ఆదాయపు పన్ను విభాగంగా పనిచేస్తున్నాయ’ని ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మాయావతిని అప్రదిష్ట పాలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని దుచయ్యబట్టారు. ఓటమి భయమే వారితో ఈ పని చేయిస్తోందని అన్నారు. ఎంత చేసినా విపక్షాల మహాకూటమి విజయాన్ని మాత్రం ఎవరూ ఆపలేరని దీమా వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos