తేజ్‌పాల్‌పై విచారణ కొనసాగాల్సిందే

తేజ్‌పాల్‌పై విచారణ కొనసాగాల్సిందే

న్యూ ఢిల్లీ: తెహల్కా పత్రిక వ్యవస్థాపకుడు, ప్రముఖ పాత్రికీ యుడు తరుణ్ తేజ్పాల్ పై వచ్చిన అత్యాచార ఆరోపణలు చాలా తీవ్రమైన వైనందున విచారణ కొనసాగాల్సిందేనని అత్యుతన్న న్యాయస్థానం సోమవారం తేల్చి చెప్పింది. తనకు వ్యతిరేకంగా దాఖలైన అభియోగాలను కొట్టి వేయాలని తేజ్పాల్ దాఖలు చేసిన వినతిని న్యాయ స్థానం తిరస్కరించింది. కేసు విచారణను ఆరు నెలల్లోగా పూర్తి చే యాలని గోవా న్యాయ స్థానాన్ని ఆదేశిం చింది. ‘లైంగిక దాడి చాలా తీవ్రమైన నేరం. నైతికంగా చాలా అసహ్యకర మైనది. ఈ కేసులో ఆరేళ్ల కిందట అభియోగాలు నమోదై నందున విచారణ ఇంకా ఆలస్యం చేయడం సరికాదు. ఆరు నెలల్లోగా కేసు విచారణ పూర్తి చేయండి’ అని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గోవా న్యాయ స్థానానికి సూచిం చింది. తరుణ్ తేజ్పాల్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెహల్కా మహిళా ఉద్యోగి కరు 2013లో ఆరోపించారు. గోవాలో ఒక ఐదు నక్ష త్రాల తెహల్కా థింక్ ఫెస్టివల్ జరిగింది.దానికి వెళ్లిన తనపై తరుణ్ తేజపాల్ లిఫ్ట్లో అత్యాచారం చేశాడని ఆమె వ్యాజ్యాన్ని దాఖలు చేసారు. ఈ ఆరో పణ లను తేజ్ పాల్ తోసి పుచ్చారు. ముందస్తు బెయిల్కు చేసిన దరఖాస్తును న్యాయస్థానం తిరస్కరించింది. 2013 నవంబరు 30న పోలీసులు అరె స్టు చేశారు. 2014 మేలో నుంచి ఆయనకు బెయిల్ లభించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos