సానుభూతి పవనాలపైనే జగన్‌ గెలుపు

సానుభూతి పవనాలపైనే జగన్‌ గెలుపు

అమరావతి: ‘ప్రజల కోపం వల్ల మనం ఓటమి చెందలేదు. జగన్‌ పట్ల ఉన్న సానుభూతే ఆ పార్టీని గెలిపించింది’అని తెదే శాసన సభా పక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. బుధవారం ఇక్కడ జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ప్రసంగించారు.‘రాష్ట్రా భివృద్ధి  కోసం ఐదేళ్లు చిత్తశుద్ధితో పని చేశాం. కాలంతో పరిగెత్తాం, అనేక పనులు చేశాం. సమర్ధ నీటినిర్వహణతో నీటి కొరతను అధిగమించాం. రాజధాని నిర్మాణ పనులు వేగంగా చేపట్టాం. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకున్నా చాలా చేశాం. కానీ, ప్రజల అంచనాలు వేరుగా ఉన్నాయి. అయినా 39. 2శాతం ఓట్లు రాబట్టాం. ఏదేమైనా కొంతకాలం వేచి చూద్దాం. కొత్త ప్రభుత్వం ఏంచేస్తుందో చూద్దాం. అన్నింటినీ నిశితంగా గమనిద్దాం, ఆ తర్వాతే స్పందిద్దాం. ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ముగ్గురు మినహా అందరూ గతంలో పని చేసిన వారే. పాత, కొత్త కలబోతతో తెలుగుదేశం వాణిని బలంగా వినిపించాలి. ఆయా నియోజక వర్గాల సమస్యలను సభలో ప్రస్తావించాలి. సకాలంలో పరిష్కారమయ్యేలా శ్రద్ధ వహించాలి’ అని చంద్రబాబు పిలుపు నిచ్చారు. సమావేశం తర్వాత విధానసభ సభ్యుడు చినరాజప్ప విలేఖరులతో మాట్లాడారు. ఉప నేతలు, విప్ల ఎంపిక బాధ్యతను చంద్రబాబుకు అప్పగిం చినట్లు చెప్పారు. తక్కువ మంది సభ్యులున్నా ప్రజల తరఫున పోరాడతామని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో ఓటమిపై విశ్లేషణ చేసుకుంటామ న్నారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos