పెళ్లి పీటలెక్కనున్న తరుణ్ !

  • In Film
  • September 18, 2020
  • 100 Views
పెళ్లి పీటలెక్కనున్న తరుణ్ !

తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిగిబ్లె బ్యాచిలర్ జాబితాలో తరుణ్ కూడా ఒకడు.బాల నటుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన తరుణ్ కెరీర్ లో అనేక విజయాలు ఉన్నాయి.అయితే కొద్ది కాలంగా పూర్తిగా వెనుకబడ్డ తరుణ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు తెలుస్తోంది.సినిమాలకు దూరమై బిజినెస్ చేసుకుంటున్న తరుణ్ కు పెళ్లి చేయాలనీ అమ్మ రోజా రమణి ఫిక్స్ అయ్యింది.ఇప్పటికే తరుణ్ వయసు 37 ఏళ్లు దాటిపోవడంతో ఇంట్లో పెళ్లికి తొందర పడుతున్నారు.దీంతో చాలా రోజులుగా అమ్మాయిని వెతుకుతుండగా ఇన్నాళ్లకు ఆ అమ్మాయి దొరికిందని వార్తలు వస్తున్నాయి. తనకు తెలిసిన వాళ్లలోనే.. ఓ స్నేహితురాలి కూతుర్ని తరుణ్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని వాళ్ల అమ్మ నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జోరుగానే జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ త్వరలోనే రానుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos