నిర్బంధ కేంద్రానికి కేంద్రమే నిధులిచ్చింది

నిర్బంధ కేంద్రానికి కేంద్రమే నిధులిచ్చింది

గువాహటి: దేశంలో ఎక్కడా నిర్బంధ కేంద్రాలు లేవని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను అసోం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత తరుణ్ గొగొయి ఖండించారు. శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. గోవాల్పారాలో నిర్బంధ కేంద్రాన్ని నిర్మించా లని ఆదేశించిన భాజపా ప్రభుత్వం కట్టడాల కోసం రూ.46 కోట్లు మంజూరు చేసిందని వివరించారు. అక్రమ వలస దారులను నిర్బంధ కేంద్రాల్లో బంధించాలనే నిర్ణయాన్ని వాజ్పేయి ప్రభుత్వం చేసిందన్నారు. గువాహటి ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు గతంలో అసోంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధ కేంద్రాల నిర్మాణం చేపట్టిందని వెల్లడించారు. ఇప్పుడు కాంగ్రెస్సే వాటిని నెలకొల్పిందనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అసోంకు వచ్చిన విదేశీయులందరినీ పంపించి వేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని ఇప్పుడు నూతన పౌరసత్వ చట్టం వల్ల సమస్యను మరింత జటిలం చేశారని విమ ర్శించారు. జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ), సీఏఏ ద్వారా ప్రజల మధ్య విభేదాల్ని సృష్టించేందుకు భాజపా ప్రయత్ని స్తోందని దుయ్య బట్టారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు తిరుగుబాటు చేస్తుండడంతో ప్రధాని తోకముడిచారని వ్యాఖ్యానిం చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos