పాకిస్థాన్‌కు తాలిబన్ వార్నింగ్..

పాకిస్థాన్‌కు తాలిబన్ వార్నింగ్..

జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు చేయడం ద్వారా తమకేదో భారత్‌ తీరని అన్యాయం చేసినట్లు దొంగ ఏడుపులు ఏడుస్తూ భారత్‌ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టడానికి పాకిస్థాన్‌ ఏచిన్న ప్రయత్నాన్ని, అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు.ఇప్పటికే పాక్ ప్రధాని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్దృష్టికి తీసుకెళ్లి రాద్ధాంతం చేస్తున్న పాకిస్థాన్‌ ఇరు దేశాల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలను అఫ్ఘానిస్తాన్పరిణామాలతో ముడిపెట్టి ప్రచారం చేయడం మొదలుపెట్టింది.దీంతో ఆఫ్ఘనిస్థాన్‌ కేంద్రంగా కార్యకలాపాలకు చేస్తున్న ఉగ్రవాద సంస్థ తాలిబన్ పాకిస్థాన్‌ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.భారత్ పాకిస్తాన్ మధ్య గొడవను ఇతర దేశాలకు ముడిపెట్టరాదని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ పాకిస్థాన్‌ను హెచ్చరించాడు. అఫ్ఘానిస్తాన్లో పరిస్థితులను భారత్ పాక్లకు ముడిపెట్టి చూపడం వల్ల రెండు దేశాల మధ్య నెలకొన్న సంక్షోభం సమిసిపోదని ఎందుకంటే అఫ్ఘానిస్తాన్లో వాస్తవ పరిస్థితి వేరుగా ఉందని తెలిపాడు. అంతేకాదు భారత్‌తో యుద్ధానికి దారి తీసేలా అడుగులు వేయొద్దని జబీహుల్లా పాకిస్థాన్‌ను హెచ్చరించాడు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos