ఝార్ఖండ్ ఘటన మానవత్వం మీద మచ్చ

ఝార్ఖండ్  ఘటన మానవత్వం మీద మచ్చ

రాంచీ: ఝార్ఖండ్ మూకదాడి ఘటన మానవత్వం మీద మచ్చలుగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం చేసిన ట్వీట్లో అభివర్ణించారు. దీనిపై భాజపాలోని కీలక గొంతుకలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ‘‘ఝార్ఖండ్లో యువకుడిపై జరిగిన మూకదాడి మానవత్వంపై మచ్చలాంటింది. నాలుగు రోజుల పాటు ఆ యువకుణ్ని కస్టడీలో ఉంచిన పోలీసుల క్రూరత్వం నాకు విచారాన్ని కలిగించింది. ఈ సందర్భంలో కేంద్రంతో పాటు భాజపా పాలిత రాష్ట్రాల్లోని కీలక గొంతుకలు నిశ్శబ్దంగా ఉండడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది’ అని ‘ఇండియా ఎగెనెస్ట్ లించ్ టెర్రర్’ హాష్ టాగ్తో రాహుల్ గాంధీ ట్విట్ చేశారు. ఝార్ఖండ్లో జరిగిన మూకదాడిలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ద్విచక్రవాహనం అపహరించాడనే ఆరోపణపైస్తూ 24 ఏళ్ల యువకుణ్ని స్తంభానికి కట్టేసి గ్రామస్థులంతా విచక్షణారహితంగా కొట్టారు. సంబంధిత వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో సంచరించి సంచలనాన్ని సృష్టించింది. ‘జై శ్రీరాం’ నినాదాలు చేయాలని బాధితుణ్ని బలవంతపెట్టడం ఆ వీడియోలోదాఖలైంది. దెబ్బలకు తాళలేక యువకుడు సృహ తప్పి పడిపోయిన తర్వాత పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు. బాధితుణ్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకు ఈ ఘటనలో 11మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos