20 గంటల్లోనే డబ్బింగ్‌ పూర్తి..

  • In Film
  • June 27, 2019
  • 171 Views
20 గంటల్లోనే డబ్బింగ్‌ పూర్తి..

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథ ఆధారంగా మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నిర్మతగా వ్యవహరిస్తూ వందల కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి చిత్రం ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.దీంతో చిత్రబృందం డబ్బింగ్‌ పనులు మొదలుపెట్టగా నరసింహారెడ్డి పాత్రను పోషించిన చిరంజీవి తన డబ్బింగ్‌ను కేవలం 20 గంటల్లో ముగించడం హాట్‌ టాపిక్‌గా మారింది.కెమెరా ముందు ఎంతగా నటించినా ఆ నటనకు మరింత వన్నె తేవాలంటే అంతేస్థాయిలో డబ్బింగ్‌ కూడా అవసరమే.కెమెరా ముందు ఎంత కష్టపడాలో.. డబ్బింగ్ థియేటర్ లో కూడా అంతే కష్టం ఉంటుంది. ప్రతీ సన్నిశాన్ని,అందులోని భావాన్ని అర్థం చేసుకొని సంభాషణలు పలికించాలి.ఒక్కోసారి వారం, పది రోజులు కూడా డబ్బింగ్ థియేటర్ లోనే గడపాల్సివస్తుంది. అయితే చిరంజీవి మాత్రం ‘సై రా’ డబ్బింగ్ ని ఇరవై గంటల్లో పూర్తి చేశారు.అయితే ఇంత త్వరగా డబ్బింగ్‌ పూర్తి చేయడం వెనుక మరొక కారణం ఉందని తెలుస్తోంది. చిరంజీవి తన కొత్త  సినిమాను వచ్చే వారమే మొదలుపెట్టాల్సి ఉండడంతో ‘సై రా’ డబ్బింగ్ ని వీలైనంత తొందరగా పూర్తి చేద్దామని నిర్ణయించుకున్న చిరంజీవి కేవలం 20 గంటల్లో డబ్బింగ్ పనిని పూర్తి చేశారు.నిజానికి ఈ సినిమాలో డైలాగ్ పార్ట్ చాలా ఎక్కువ.. కొన్ని సన్నివేశాల్లో పేజీల కొద్దీ డైలాగులు పలకాల్సివచ్చిందట.  అయితే చిరు మాత్రం తనకున్న అనుభవంతో అతి తక్కువ సమయంలో డబ్బింగ్ పూర్తి చేసేశారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos