స్విగ్గి సిబ్బంది ధర్నా

స్విగ్గి సిబ్బంది  ధర్నా

విజయవాడ : గతంలో మాదిరే కమిషన్ కొనసాగించాలని, కార్మికుల పట్ల కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నగరంలోని అలంకార్ ధర్నా చౌక్ వద్ద స్విగ్గి కార్మికులు ధర్నా నిర్వహించారు. వారికి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఆర్వి.నరసింహారావు మద్దతు ప్రకటిం చారు. హోటల్ యాజమాన్యాలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘ప్రాణాలు లెక్క చేయకుండా పని చేస్తున్న స్విగ్గి కార్మికులకు కమిషన్లు పెంచా ల్సిందిపోయి తగ్గించటం సిగ్గుచేటు. అందరికీ సమయానికి కడుపు నింపే కార్మికులకు తిండి లేకుండా చేయటం ఏమాత్రం సరికాదు. నాలుగు కిలో మీటర్ల దూరం వెళ్లేవారికి గతంలో రూ.30 కమిషన్ ఇచ్చేవారు. ఇప్పుడు దాన్నిరూ.15లకు కుదించారు. పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరి గాయి. ద్విచక్ర వాహనాల్ని రోజూ వాడుతున్నందున వాటి నిర్వహణ వ్యయం అధ్కిమవుతోంది. ఆదాయంలో సగం అందుకే ఖర్చయి పోతోంది. వీట న్నింటిని గుర్తింయి కమిషన్ పెంచటానికి బదులుగా తగ్గించటం అన్యాయం. స్విగ్గి కార్మికుల్లో డిగ్రీలు, బీటెక్ వంటి పెద్ద చదువులు చదివిన వారున్నా రు. ఈ ఉద్యోగాల వల్ల కుటుంబాల్ని పోషించుకుందామనుకుంటే ఇక్కడ కూడా బతకలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా స్విగ్గి యాజ మాన్యం ప ట్టింపులకు పోకుండా చర్చలకు వచ్చి పాత పద్ధతిలో ఇచ్చే కమిషన్ కొనసాగించాలలి. లేని పక్షంలో స్విగ్గి కార్మికులకు అండగా నిలిచి పోరాటాన్ని సాగిస్తామ’ని హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos