దేశంలో సూపర్ ఎమర్జెన్సీ

దేశంలో సూపర్ ఎమర్జెన్సీ

కోల్కతా : ‘గత ఐదేళ్లుగా దేశంలో సూపర్ ఎమర్జెన్సీ నడుస్తోంది. చరిత్ర నుంచి మనం గుణపాఠాలు నేర్చుకుని దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్ధల పరిరక్షణకు పోరాడా’ పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమత బెనర్జి మంగళవారం ట్వీట్ చేశారు కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వ హయాంను 44 ఏళ్ల కిందట ఇందిరా గాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీతో పోల్చారు. ఎమర్జెన్సీ పాఠాల నుంచి దేశం గుణపాఠాలు నేర్చుకుని, ప్రజాస్వామ్య వ్యవస్ధలను కాపాడుకోవాలని ఆమె హితవు పలికారు. గత కొన్నేళ్లుగా పలు అంశాలపై మోదీ ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలను మమతా బెనర్జీ దుయ్యబడుతున్నారు. బంగలో ఎన్నికల అనంతరం సంభవించిన హింసా కాండలో బీజేపీ, తృణమూల్ కార్యకర్తలు మరణించడంతో రెండు పక్షాల మధ్య ఘర్షణలు తారాస్ధాయికి చేరాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos