అభిమాని కోసం సుమన్‌ పూజలు..

  • In Film
  • June 28, 2019
  • 107 Views
అభిమాని కోసం సుమన్‌ పూజలు..

అభిమాన నటీనటులు,క్రికెటర్లు,రాజకీయ నేతలకు స్వస్తి చేసినపుడో లేదా గాయపడినపుడో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ అభిమానులు పూజలు,హోమాలు చేయడం ఇప్పటికే లెక్కలేనన్ని సార్లు చూసి ఉంటాం.అయితే అభిమాని అనారోగ్యం నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తూ సినీనటులు దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయడం ఎప్పుడైనా చూశారా.కానీ ఇది నిజంగానే జరిగింది.ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా వెలుగు వెలిగి అప్పటి తరం అమ్మాయిలకు కలల రాకుడిమారుడిగా వెలుగొంది ప్రస్తుతం కెరక్టర్‌ పాత్రల్లో నటిస్తున్నసీనియర్ నటుడు సుమన్ తన అభిమాని కోసం పూజలు నిర్వహించడం సినీ వర్గాల్లో చర్చనీంయాశమైంది.చిత్తూరు జిల్లా పాకాలకు చెందిన నాగరాజు నాయుడుకు నటుడు సుమన్‌ అంటే ఎనలేని అభిమానం.నటుడు సుమన్‌కు సంబంధించిన ప్రతీ విషయాన్ని నాగరాజు నాయుడు ప్రత్యేకంగా సేలబ్రెట్‌ చేసుకుంటారు.అటువంటి అభిమాని నాగరాజు నాయుడు కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురైన సమాచారం తెలుసుకున్న సుమన్ హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తిరుపతికి విమానంలో వెళ్లారు. రేణిగుంటలోని రాజరాజేశ్వరి దేవిని దర్శించుకొని తన అభిమాని త్వరగా కోలుకోవాలంటూ పూజలు చేశారు. ఇప్పటివరకూ ప్రముఖులకు వారి అభిమానులు పూజలు చేసిన దానికి భిన్నంగా తన అభిమాని కోసం సుమన్ పడిన తపన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos