సిబిఐ విచారణకు సుజన గైరు హాజరు

సిబిఐ విచారణకు సుజన గైరు హాజరు

హైదరాబాద్:అరెస్టు భయంతో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి శుక్రవారం బెంగళూరు సిబిఐ విచారణకు గైరు హాజరయ్యారని తెలిసింది. 2010 – 2013 మధ్య కాలంలో బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన రూ.364 కోట్ల వంచన కేసులో ఏప్రిల్ 25న తమ విచారణకు కావాలని బెంగళూర్ సిబిఐ బ్యాంకింగ్ సెక్యురిటీ అండ్ ఫ్రాడ్ సెల్ సుజనా చౌదరికి తాఖీదుల్ని జారీ చేసింది. దీని ప్రకారం ఆయన శుక్రవారం ఇక్కడి నుంచి బయలుదేరి బెంగళూరు వెళ్లారు. విచారణకు తనకు బదులుగా హాజరు కావాలని తమ సంస్థ సంచాలకుల్ని ఆదేశించినట్లు తెలిసింది. విచారణకు హాజరైతే అరెస్టు అయ్యే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు భావిస్తున్నారు. దరిమిలా ఆయన ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానంలో వ్యాజ్యాన్ని దాఖలు చేయనున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. వాయిస్‌లు, నకిలీ కంపెనీల ద్వారా మహల్ హోటల్స్ కు డబ్బులు బదిలీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్, మహల్ హోటల్ కంపెనీలు రెండు కూడా సుజనా చౌదరికి చెందినవే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos