అన్నదాతల ఆత్మహత్యల్ని ఆపండి

అన్నదాతల ఆత్మహత్యల్ని ఆపండి

ముంబై: రైతుల ఆత్మహత్యలు, మరాఠా రిజర్వేషన్ల పై ప్రభుత్వం వెంటనే సముచిత నిర్ణయాన్ని సుకోవాలని శివసేన పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేసింది. అధికారిక పత్రిక సామ్నా మంగళవారపు సంపాదకీయంలో రెండు అంశాల గురించి ప్రభుత్వాన్ని ఎండగట్టింది. ‘రాష్ట్రంలో గత నాలుగేళ్ల నుంచి రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. వాటి నివారణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో తెలపాలి.గత ఐదేళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రథయాత్రను ఆక్షేపించింది. రైతాంగ సమస్యలను పరిష్కరించిన తరువాతే యాత్రను చేపట్టాలని డిమాండు చేసింది. రైతులకు ఏం చేశారని ప్రభుత్వ విజయంగా భావిస్తారని ప్రశ్నించింది. రుణ మాఫీకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందువల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నారని వివరించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భాజపా సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ చేపట్టిన రథయాత్రకు 25 ఏళ్లు పూర్తి అయినట్లు సామ్నా గుర్తుచేసింది. కానీ ఇంకా ఆలయ నిర్మాణం గురించి భాజపా ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేకపోయిందని ఎ ద్దేవా చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos