కుప్ప కూలిన స్టాక్‌ మార్కెట్‌

కుప్ప కూలిన స్టాక్‌ మార్కెట్‌

ముంబై: స్టాక్ మార్కెట్లకు బడ్జెట్ పిడుగు పాటైంది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే వేళకు సెన్సెక్స్ 394 పాయింట్లు నష్టపోయి 39,513 వద్దకు, నిఫ్టీ 137 పాయింట్లు నష్టపోయి 11,811కు దిగింది. భారీ లాభాల్లో మొదలైన ట్రేడింగ్ ఒక దశలో సెన్సెక్స్ 40,032 చేరింది. బడ్జెట్ అనంతరం మదుపరులు భారీగా అమ్మకాలకు దిగారు. దీంతో చివరికి నష్టాల్లో ముగిసింది. యస్బ్యాంక్, ఎన్టీపీసీ, మహీంద్రా సంస్థల షేర్లు భారీగా నష్ట పోయాయి. బ్యాంక్, నిఫ్టీ తప్పితే మిగిలిన సూచీలన్నీ దాదాపు నష్టాల్లోనే ముగిశాయి. ప్రభుత్వం రూ.70 వేల కోట్లను బ్యాంకులకు ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించడంతో ఆ సూచీ మాత్రం లాభాల్లో ట్రేడైంది. ఇక లోహ రంగ, స్థిరాస్తి, మోటారు వాహనాల సూచీలు బాగా కుంగాయి. ఆటోమొబైల్ విడి భాగాలపై దిగుమతి సుంకం పెంచడంతో ఆ మేరకు షేర్లు పడిపోయాయి. బంగారంపై పన్ను 12.5శాతానికి చేర్చడం, పెట్రోల్ , డీజిల్పై రూపాయి చొప్పున అదనంగా భారం మోపడంతో సూచీలు బాగా నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos