అవినీతి వాలంటీర్లకు ఉద్వాసన

అవినీతి వాలంటీర్లకు ఉద్వాసన

జమ్మల మడుగు: లంచాల్ని తీసుకునే గ్రామ వాలంటీర్లను వెంటనే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ప్రకటించారు. సోమవారం ఇక్కడ జరిగిన రైతు దినోత్సవ సభలో ప్రసంగించారు. గత ప్రభుత్వ వైఫల్యాలు, నెల రోజుల్లో తమ ప్రభుత్వ సాధనల్ని వివరించార. ‘ వచ్చే సెప్టెంబర్ ఒకటి నుంచి గ్రామ వాలంటీర్లు మీ తలుపు తట్టి పింఛను ఇస్తారు. అదే రోజు నుంచి ప్రభుత్వ పథకాలను వివరిస్తారు. గ్రామ వాలంటీర్లు ఎవరూ లంచం తీసుకోరు. ఎవరైనా లంచం తీసుకుంటే నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేయండి. లంచం తీసుకున్నట్టు రుజువైతే వారిని తక్షణమే ఉద్యోగంలోంచి పీకి పారేస్తామ’ని ప్రకటించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ‘ ఫించన్ల కోసం గత ప్రభుత్వం 2017-18లో రూ.5,436 కోట్లు, 2018-19లో మాత్రం ఎన్నికలకు నాలుగు నెలల ముందు రూ.8,234 కోట్లు ఖర్చు చేశారు. నెల తిరగకుండానే మా ప్రభుత్వం పింఛన్ల కోసం రూ.15,675 కోట్లు ఖర్చు చేసింద’ని వివరించారు.‘ఈ ఏడాదికి రూ.84వేల కోట్లు పంట రుణాలుగా అందించాలని నిర్ణయించాం. రుణాలు తీసుకున్నవారు గడువులోగా తీరిస్తే వడ్డీ చెల్లించనక్క ర్లేద’న్నారు.
కడప ఉక్కు సాకారం చేస్తా

కడపఉక్కు పరిశ్రమ ఏ పనీ జరగక ఆగిపోయిన పరిస్థితిలో ఉంది. డిసెంబర్ 26న జగన్ అనే నేను వచ్చి అదే ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తానని హామీ ఇస్తున్నా. మూడేళ్లలోనే ఆ ప్రాజెక్టును పూర్తిచేసి మీ అందరికీ అందిస్తానని మాటిస్తున్నా. మీ అందరి కలల్ని సాకారం చేస్తానని సగర్వంగా చెబుతున్నా. ఈ ప్రాజెక్టు ద్వారా 20వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంద’ని హామీ ఇచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos