ఉక్కు పరిరక్షణకు పోరాట సమితి

ఉక్కు పరిరక్షణకు పోరాట సమితి

విశాఖ : విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్విహించేందుకు ఉక్కు పరిరక్షణ కమిటీ గురువారం ఏర్పాటైంది. కమిటీ కన్వీనర్గా జె.అయోధ్యారాం, చైర్మన్లుగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నరసింగరావు, మంత్రి రాజశేఖర్, సిపిఎం విశాఖ నగర కార్యదర్శి డాక్టర్ గంగారావులు ఎంపికయ్యారు. శుక్రవారం నుంచి కూర్మన్న పాలెం వద్ద రిలే దీక్షలను చేపడుతున్నట్లు కమిటీ కన్వీనర్ జె అయోధ్యారాం తెలిపారు. ఈ నెల 18న స్టీల్ప్లాంట్ 39వ ఆవిర్భావ దినోత్సవాన్ని కార్మికులంతా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. గడచిన 35 ఏళ్లుగా కుటుంబాలతో సహా ఆవిర్భావ దినోత్సవంలో పాల్గనేవాళ్ళమని, కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల ఈసారి వేడుకలను బహిష్కరిస్తున్నట్లు అయోధ్యరాం తెలిపారు. కుటుంబాలతో సహా ఈనెల 28న మహా బహిరంగ సభ జరుపుతున్నామని, ఇతర జిల్లాలనుంచి ఉక్కు పరి రక్షణకు కదలి వస్తున్నారన్నారని తెలిపారు. 25 మందితో ఏర్పాటు చేసిన ఉక్కు పరిరక్షణ కమిటీతో పాటు మరో15 మంది వివిధ ప్రజాసంఘాలు నేతలతో కూడిన కమిటీ నిరంతరం పోరాడుతుందని వివరించారు. ఈ నెల 12న ప్రారంభించే నిరాహార దీక్షల్లో స్టీల్ ప్లాంట్ అధికారులు, విద్యార్థులు, కార్మిక కుటుంబాలు పాల్గొంటాయని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos