స్టాన్‌ స్వామి కన్నుమూత

స్టాన్‌ స్వామి కన్నుమూత

న్యూఢిల్లీ: గిరిజన హక్కుల కార్యకర్త, భీమా కోరేగావ్ కేసు నిందితుడుగా తలోజా జైలులో ఉన్న స్టాన్ స్వామి (84) సోమవారం కన్నుమూశారు. అక్టోబర్, 2020 నుంచి తలోజా జైలులో ఉన్న స్టాన్ స్వామి పార్కిన్సన్స్ బాధితుడు. కొన్ని రోజుల కిందట కోవిడ్ బారిన పడ్డారు. దాని నుంచి కోలుకున్నా ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో చేర్చారు. ఆదివారం నుంచి వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందిస్తుండగా సోమవారం ఆయన మృతి చెందారు. స్టాన్ స్వామికి గతంలో ఎన్ఐఏ కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు చివరకు ఆహారం తీసుకోవడానికి కనీసం సిప్పర్ కూడా అనుమతించకపోవడం పట్ల గతంలో పలు విమర్శలు వచ్చాయి. మహారాష్ట్రలోని పుణె సమీపంలో భీమా కోరెగావ్ వద్ద జనవరి 1, 2018న జరిగిన హింసాత్మక ఘటనల్లో ఒకరు చనిపోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అంతకు ముందు రోజు, ఎల్గార్ పరిషత్ సభ్యులు చేసిన రెచ్చ గొట్టే ప్రసంగాల తరువాతనే ఈ హింసాత్మక ఘటనలు జరిగాయని ఎన్ఐఏ పేర్కొంది. వారు దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని, మావోయిస్టులకు ఆర్థిక సాయం అందించారని అభియోగాలు మోపింది.∙అందుకు తగ్గ సాక్ష్యాలు తమ దర్యాప్తులో బయట పడ్డా యని తెలిపింది. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే మేధావులను ఏకం చేసే బాధ్యతను నవ్లఖా నిర్వహించేవారని చెప్పింది. ఫాదర్ స్టాన్ స్వామి మావో కార్యకలాపాల్లో చురు కుగా ఉండేవారని, ఇతర కుట్రదారులతో సంప్రదింపులు జరుపుతుండేవారని ఎన్ఐఏ ఆరోపించింది. ఈ ఆరోపణలను స్టాన్ స్వామి ఖండించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos