నష్టాల నుంచి బయట పడ్డ మార్కెట్లు

నష్టాల నుంచి బయట పడ్డ మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్ల వ్యాపారం సోమవారం సాదా సీదాగా మొదలైంది. ఉదయం 9.56 గంటల వేళకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 3 పాయింట్లు నష్టపోయి 40,318 వద్ద, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 6 పాయింట్లు నష్ట పోయి 11,901 వద్ద  ట్రేడ్ అయ్యాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 70.70 వద్ద దాఖలైంది. మొదట భారీ నష్టాలతో ప్రారంభమైన వ్యాపా రాలు క్రమంగా కోలుకున్నాయి. ప్రముఖ షేర్ల ధరలు ఎక్కువగా ఉన్నందున మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపొచ్చని భావిస్తున్నారు. యెస్ బ్యాంక్, జీ ఎంటర్టైన్మెంట్, ఎమ్ అండ్ ఎమ్, ఐఓసీ, యూపీఎల్ షేర్లు లాభాల్ని గడించాయి. గ్రాసిమ్, భారతీ ఇన్ఫ్రాటెల్, సన్ఫార్మా, సిప్లా, హెచ్సీఎల్ టెక్ నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos