గరిష్ట మట్టానికి చేరువగా శ్రీశైలం

గరిష్ట మట్టానికి చేరువగా శ్రీశైలం

శ్రీశైలం : మహారాష్ట్ర, కర్ణాటకలను వీడని వర్షాలు శ్రీశైలంలో వేగంగా నీటి మట్టం పెరుగుదలకు కారణమవుతున్నాయి. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 874.70 అడుగులు ఉంది. 215.81 టీఎంసీలకు గాను ఇప్పుడు 165.05 టీఎంసీల నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 2,76,648 క్యూసెక్కులుగా నమోదవుతోంది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1600 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం ద్వారా4 2,378 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడిగట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి 31,613 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 15,000 క్యూసెక్కులు, ముచ్చిమర్రి నుంచి కేసీ కెనాల్‌కు 735 క్యూసెక్కులు, హంద్రీనీవా ప్రాజెక్టుకు 1013 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శుక్రవారం తర్వాత ఎప్పుడైనా శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos