శృతి మించుతున్న శ్రీరెడ్డి పోస్టులు..

  • In Film
  • September 7, 2019
  • 91 Views
శృతి మించుతున్న శ్రీరెడ్డి పోస్టులు..

ఎప్పుడూ వార్తల్లో ఉండాలనే తాపత్రయమో లేక ప్రజలు మరచిపోతారనే భయమో కానీ శ్రీరెడ్డి కొద్ది రోజులుగా మరింత రెచ్చిపోయి పోస్టులు చేస్తోంది.మొదట్లో శ్రీరెడ్డిపై ఆసక్తికర వార్తలు ప్రచురించిన ఛానెళ్లు,వెబ్సైట్లు క్రమక్రమంగా శ్రీరెడ్డిని లైట్ తీసుకోవడంతో వివాదాస్ప పోస్టులు చేస్తూ లైమ్లైట్లో ఉండేలా చూసుకుంటోందని విమర్శలు వినిపిస్తున్నా శ్రీరెడ్డి తీరులో మాత్రం మార్పు రావడం లేదు.కొన్నిసార్లు శ్రీరెడ్డి చేస్తున్న పోస్టులు మరీ శృతి మించుతున్నాయి.తాజాగా శ్రీరెడ్డి తన ఫేస్బుక్ ఖాతాలో సంచలన పోస్ట్ పెట్టింది. ‘ధనవంతులు వర్జినిటీని లెక్క చేయరు. అందుకే వాళ్లు హీరోయిన్లను కోడళ్లుగా తెచ్చుకుంటారు. మందు తాగే మహిళలను కూడా. ధనవంతులను ఫాలో అవ్వండి.. ధనవంతులు అవ్వండి’ అని అందులో పేర్కొంది. దీంతో ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి చేసింది అనే అంశంపై అందరూ చర్చించుకుంటున్నారు..

Rich families never care virginity.they get heroines as a daughterinlaw,drinking women nd wat not.follow rich persons,become rich

Posted by Sri Reddy on Thursday, September 5, 2019

తాజా సమాచారం

Latest Posts

Featured Videos