నీ కారెంత? నీ స్థాయి ఎంత?

  • In Film
  • August 13, 2020
  • 219 Views
నీ కారెంత? నీ స్థాయి ఎంత?

దగ్గుబాటి అభిరామ్‌ కారుకు ప్రమాదం జరిగిందని నేటి ఉదయం నుంచి వార్తలు దావానంలా వ్యాప్తి చెందుతున్నాయి. అయితే వీటిపై దగ్గుబాటి కుటుంబం స్పందించింది. ఆ వార్తలను ఖండిస్తూ ఓ ప్రకటన కూడా జారీ చేసింది. కారు ప్ర‌మాదానికీ, ద‌గ్గుబాటి అభిరామ్‌కూ ఎలాంటి సంబంధం లేదు.. అది ద‌గ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించిన కారే కాదని స్ప‌ష్టం చేశారు.ఇలాంటి వార్తలు వస్తే శ్రీ రెడ్డి ఊరికనే ఉంటుందా? తన మనసులో ఉన్నదంతా బయట పెట్టేయ్యదూ. ఆ మధ్య ఐటీ దాడులు జరిగితే కూడా ఇలానే స్పందించింది. అన్నపూర్ణ స్టూడియో, రానా, వెంకటేష్, నాని కార్యాలయాల్లో ఐటీ దాడులు జరగడంపై శ్రీరెడ్డి సంచలన కామెంట్స్ చేసింది. పాపం ఊరికనే పోదంటూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్అయ్యాయి. తాజాగా అభిరామ్ కారుకు ప్రమాదం అనగానే ఓ వీడియో రిలీజ్ చేసింది.‘అభి నీకు గుర్తుందా? నీ కారెంత? నీ స్థాయి ఎంత? నేను రానా తమ్ముడిని? సురేష్ బాబు కొడుకును? రామా నాయుడు మనవడిని? నీదో డొక్కు కారు? నువ్ ఆఫ్ట్రాల్ రోడ్ సైడ్ యాక్టర్‌వి అని అన్నావే? నన్ను, నా కార్‌ను అవమానించావే? ఈ రోజు నీ కారుకు ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది.దేవుడు ఉన్నాడ్రా.. దేవుడు ఉన్నాడు ఎప్పుడూ మిడిసిపడకు.. ఈ డబ్బులు పేరు అందం అన్నీ అశాశ్వతం.. శాశ్వతమైనవి కొన్నే మంచితనం, మంచి పేరు ఎదుటివారిని అర్థం చేసుకోవడం ఎదుటోళ్లకు అపకారం చేయకుండా మంచిగా ఉండటం. నేనైతే ఓ పెద్ద అంత పెద్ద ఉత్తమురాలిని, మహర్షిని అయితే కాకపోవచ్చు గానీ చాలా మటుకు ఫాలో అవుతున్నాను.. నేర్చుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos