అంపైర్‌కు తప్పిన ‘స్పైడర్‌’ ముప్పు

అంపైర్‌కు తప్పిన ‘స్పైడర్‌’ ముప్పు

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో స్పైడర్‌ కెమెరా ప్రమాదం నుంచి చైర్‌ అంపైర్‌ త్రుటిలో బయటపడింది. రష్యన్‌ బ్యూటీ మరియా షర పోవా, యాష్లీ బార్తీ మధ్య ప్రీ క్వార్టర్స్‌ మ్యాచ్‌ సం దర్భంగా ఈ ప్రమాదం జరిగింది. అప్పర్‌ వ్యూ కోసం ఉపయోగించే స్పైడర్‌ కెమెరా అదుపుతప్పి అంపైర్‌ అలిసన్‌ హ్యూజెస్‌ కూర్చున్న చైర్‌ పైకప్పు ను కూల్చేసింది. అలిసన్‌ త్రుటిలో ప్రమాదం నుం చి బయటపడిందని.. లేకపోతే కెమెరా ఆమె తల ను బలంగా తాకేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos