కరోనా కాటుపై అమ్మవారికి వేడుకోలు

కరోనా కాటుపై అమ్మవారికి వేడుకోలు

హొసూరు : దేశ వ్యాప్తంగా ప్రబలుతున్న కరోనాను అదుపు చేసి, ప్రజల సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని ప్రార్థిస్తూ ఇక్కడికి సమీపంలోని ప్రత్యంగిరా దేవి దేవాలయంలో యాగాలు, విశేష పూజలు నిర్వహించారు. మోరణపల్లి గ్రామం వద్ద సుప్రసిద్ధ దేవాలయంగా పేరుగాంచిన ప్రత్యంగిరాదేవి దేవాలయంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. రాహు, కేతు సమేత కాలభైరవుడు, ప్రత్యంగిరా దేవికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో మిరపకాయలతో మహా యాగం నిర్వహించి కరోనా వైరస్ మాదిరి బొమ్మను యజ్ఞ కుండంలో వేశారు. కాలభైరవునికి, ప్రత్యంగిరాదేవికి పాలు, పసుపు, పెరుగు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించిన అనంతరం మహా మంగళహారతినిచ్చారు. భక్తులకు తీర్థ ప్రసాదాల పంపకంతో ఈ కార్యక్రమం పూర్తయింది. ఈ ప్రత్యేక పూజల్లో బెంగుళూరుకు చెందిన బ్రహ్మాండ గురూజీ, సప్తగిరి అమ్మ పాల్గొని, యాగాలు నిర్వహించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos