దివ్యాంగ బాలలు మంచి జీవితాన్ని పొందాలి

దివ్యాంగ బాలలు మంచి జీవితాన్ని పొందాలి

నెల్లూరు: దివ్యాంగ బాలల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని లోక్సభ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి సంతోషించారు. ఆయన జన్మదినోత్సవం సందర్భంగా నెల్లూరు రెడ్ క్రాస్ ప్రాంగణంలో జరిగిన రక్తదాన శిబిరం, దివ్యాంగ బాలలకు అన్నదానం, వ్యాయామ పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. రెడ్క్రాస్ ఆధ్వర్యంలో చాలా సంస్థలు సేవాగుణం తో పని చేస్తున్నాయని ప్రశంసించారు. దివ్యాంగ బాలలు ఇక్కడ లభిస్తున్న శిక్షణతో కోలుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టి , స్వతం త్ర్యంగా జీవించాలని ఆకాంక్షించారు. రక్తదానం ఉత్తమమైనదని, దీనివల్ల ఎందరో ప్రాణాలను రక్షించ వచ్చునని తెలిపారు . ముఖ్యంగా విష జ్వరాలు ప్రబలి ఉన్న ఈ తరుణంలో రక్తదానానికి ఎంతో ప్రాధాన్యం ఉందని చెప్పారు. రెడ్ క్రాస్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి మనోహర్ రెడ్డి అధ్యక్షత వహించారు. జిమ్ వంశీ ఆధ్వర్యంలో దాదాపు 50 మందికి పైగా రక్తదానం చేశారు .ఈ సందర్భంగా వికలాంగ బాలలకు తన తరఫున ఒక వ్యాయా మ పరికరాన్ని అందించారు. మానసిక వికలాంగుల కేంద్రంలోని దాదాపు 150 మంది బాలలకు అన్నదానం చేసారు. ఈ కార్యక్రమంలో , కోటేశ్వర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి , అబూబకర్, ఇక్బాల్, పాముల హరి , హరి శివారెడ్డి, డాక్టర్ సుబ్రమణ్యం, నరసింహా రావు, ఎస్ గోపి, బాల చెన్నయ్య తదిత రులు పాల్గొన్నారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos