లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అస్ప‌ష్ట తీర్పు..మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌ధాని అయ్యే అవ‌కాశం

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అస్ప‌ష్ట తీర్పు..మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌ధాని అయ్యే అవ‌కాశం

కోల్కతా: లోక్సభ ఎన్నికల్లో ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ రాదని, మమతా బెనర్జీ తదుపరి ప్రధాని అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ (77) ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 4న అస్పష్ట తీర్పు వెలువడనుందని, 30 మందికి పైగా ఎంపీలతో మమతా బెనర్జీ ప్రధాని అయ్యే అవకాశం ఉందని అన్నారు. మూడు సార్లు ఆమె విజయవంతంగా సీఎం బాధ్యతలు నిర్వర్తించడం కూడా దీదీకి కలిసివస్తుందని చెప్పారు. ఇక నాలుగోసారి పార్లమెంట్ ఎన్నికల్లో తలపడుతున్న సౌగతా రాయ్ తన విజయంపై విశ్వాసం వ్యక్తం చేశారు. తాను నాలుగోసారి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచానని, తాను గతంలో ఓ సారి బారక్పూర్ నుంచి కూడా ఎంపీగా ప్రాతినిధ్యం వహించానని చెప్పారు. తాను 1977లో తొలిసారి ఎంపీ అయిన క్రమంలో చరణ్ సింగ్, మొరార్జీ దేశాయ్ వంటి దిగ్గజ నేతలను చూశానని, ఇవాళ మీరు అలాంటి గొప్ప నేతలను చూడలేరని సౌగతా రాయ్ పేర్కొన్నారు. రోజులు మారాయని, తాను తొలినాళ్లలో సీనియర్ నేతలను సలహాల కోసం సంప్రదించేవాడినని, ఇప్పుడు గూగుల్ అంకుల్ను ఆశ్రయిస్తున్నానని చెప్పుకొచ్చారు. రాం విలాస్ పాశ్వాన్, శరద్ పవార్ వంటి తన పాత సహచరుల పిల్లలు ఇప్పడు తన కొలీగ్స్ అని చెప్పారు. 75 ఏండ్లు దాటినవారిని బీజేపీ పక్కన పెడుతున్నాదని, ఎల్కే అద్వానీని అలాగే తప్పించారని అన్నారు. శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉంటే ఆయా నేతలు దేశానికి అవసరమని, ప్రజామోదం ముఖ్యమని సౌగతా రాయ్ అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos