విజ‌య‌వంతంగా నాలుగోసారి ఆదిత్య ఎల్‌1 క‌క్ష్య పెంపు

విజ‌య‌వంతంగా నాలుగోసారి ఆదిత్య ఎల్‌1 క‌క్ష్య పెంపు

బెంగుళూరు: సూర్యుడి అధ్యయనం కోసం చేపట్టిన ఆదిత్య-ఎల్1శుక్రవారం తెల్లవారు జామున మరో కక్ష్యలోకి ప్రవేశించింది. నాలుగో సారి కక్ష్య పెంపు సజావుగా సాగినట్లు ఇస్రో పేర్కొంది. కక్ష్య వృద్ధి ప్రక్రియలో మారిషస్, బెంగుళూరు, షార్, పోర్టు బ్లెయిర్లో ఉన్న ఇస్రో స్టేషన్లు ఆ శాటిలైట్పై నిఘా వహించాయి. ఫిజి దీవుల నుంచి ఆదిత్య ఎల్1కు చెందిన పోస్టు బర్న్ ఆపరేషన్స్ పర్యవేక్షిస్తున్నారు. కొత్త కక్ష్య 256 కి.మీ x 121973 కి.మీ దూరంలో ఉన్నట్లు ఇస్రో పేర్కొన్నది. మళ్లీ ఈ నెల 19వ తేదీన కక్ష్య పెంపు ఉంటుందని ఇస్రో తెలిపింది. ట్రాన్స్ లాగ్రాజియన్ పాయింట్ 1 లోకి వెళ్తుందని, భూ కక్ష్య నుంచి ఆదిత్య దూరం అవుతుందని ఇస్రో పేర్కొన్నది. 19వ తేదీన ఉదయం 2 గంటలకు ఈ ఆపరేషన్ చేపట్టనున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos