ధూమపానంతో దృష్టి లోపం

ధూమపానంతో దృష్టి లోపం

ధూమపానం వల్ల అనేక
అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నా, పొగరాయుళ్లు వాటి బారి నుంచి బయటపడడం
లేదు. తాజాగా ఎక్కువ సిగరెట్లు కాల్చేవారి రెటీనాలోని రక్త నాళాలు, ఇతరత్రా భాగాలు
దెబ్బ తింటాయని అమెరికాలోని ఓ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తలు తెలిపారు. దీని వల్ల
కంటి చూపు మందగించడంతో పాటు చూపును కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.
రోజుకు 20 కంటే ఎక్కువ సిగరెట్లు తాగే వారు దృష్టి కోల్పోయే ప్రమాదం ఎక్కువగా
ఉందని తెలిపారు. 25-45 ప్రాయంలోని వారిని పరిశీలించగా, ఎక్కువ సిగరెట్లు
కాల్చేవారి కంటి రక్త నాళాలు బాగా దెబ్బ తిన్నట్లు తేలిందన్నారు.

తాజా సమాచారం