పాలకుల మొద్దు నిద్రకు జవాన్లు బలి

పాలకుల మొద్దు నిద్రకు జవాన్లు బలి

న్యూ ఢిల్లీ: భారత్-చైనా మధ్య పోరులో భారత్ పరాజయానికి కారణాలు తెలిసాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత నేత రాహుల్ గాంధీ శుక్రవారం ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ‘ఈ విషయాలు ఇప్పుడు స్పష్టమయ్యాయి. 1) గాల్వన్లో చైనా దాడి ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగింది. 2) భారత ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకోకుండా మొద్దు నిద్ర పోయింది. 3) దీంతో మన వీర జవాన్లు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది’ అని దుయ్యబట్టారు. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ చేసిన వ్యాఖ్యలనూ దీనికి జత పరిచారు. చైనా ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ దాడి జరిగిందని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం. మేము రాజీపడబోము. మన భూభాగాన్ని ఆక్రమించుకునే అవకాశాన్ని ఇవ్వబోమ’ని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos