లేటు నిద్ర ఆరోగ్యానికి చేటు

లేటు నిద్ర ఆరోగ్యానికి చేటు

మన పెద్దోళ్లు ఆరోగ్య సూత్రాలను
కచ్చితంగా పాటించడంతో పాటు అందరూ దానిని పాటించాలని చెబుతూ వచ్చారు. అందులో భాగమే త్వరగా
నిద్రపోయి తెల్లారేసరికి నిద్ర లేవాలనేది వారు బోధించిన ఆరోగ్య సూత్రాల్లో ఒకటి. అలా
చేస్తే ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటామట. రాత్రి త్వరగా నిద్రపోయి ఉదయాన్నే నిద్రలేచే వాళ్ల కంటే ఆలస్యంగా నిద్రపోయి ఆలస్యంగా లేచే వాళ్ల మెదడు పనితీరులో తేడాలు ఉంటాయని తాజా అధ్యయనంలో తేలింది. లేటుగా నిద్రపోయే వాళ్ల మెదడు మందగించి, రోజూవారీ పనుల్లో అవరోధాలు ఏర్పడే ప్రమాదం ఉందని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ సర్రే శాస్త్రవేత్తలు తెలిపారు. చేసే పనుల్లో చురుకుతనం తగ్గిపోవడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయని వెల్లడించారు.

తాజా సమాచారం