నరేశ్ ఓ నియంత

నరేశ్ ఓ నియంత

హైదరాబాదు: నరేశ్ వంటి వ్యక్తి మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (మా) అధ్యక్షుడుగా ఉండటం చాలా దుర దృష్టకరమని సంస్థ మాజీ అధ్యక్షుడు శివాజీరాజా శుక్రవారం ఇక్కడ వ్యాఖ్యానించారు. `నిన్నటి గొడవలు చాలా దురదృష్టకరం. చిరంజీవి తదితర పెద్ద ల ఎదుటే ఇలా జరగడం బాధ. ఎన్నికలు జరిగి ఇంత కాలం అవుతున్నప్పటికీ రూపాయి లెక్క తెలియని అధ్యక్షుడు దీని పై ఎలా స్పందిస్తారు. పెద్దలను పిలిచి సభను రసాభాస చేయడమే కాకుండా అవమాన పరిచారు. మా పనుల్ని తప్పు బట్టారు. అవన్నీ తప్పుడు లెక్కలుగా తేలిన తర్వాత క్షమాపణలు కూడా చెప్పలేదు. వ్యక్తిగతంగా ఎవరినీ దూషించడం లేదు. కానీ ఆత్మ విమర్శ చేసుకోవాలి. రాజశేఖర్గారు చాలా భావనాత్మకమై వ్యక్తి సంస్థకు రూ.10 లక్షలు విరాళం ఇచ్చినా ఎన్నడూ బయటకు చెప్పుకోలేదు. నరేష్ గారు ఎంత నిధి తెచ్చారో చెప్పాలి. దాతలు విరాళాలు ఇస్తామని ముందుకు వస్తే వడ్డించిన విస్త రని కాలితో తన్నారు. ఇలాంటి అధ్యక్షుడు ఉండటం చాలా దురదృష్టకరం` అని ఆక్రోశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos