కారుణ్య మరణానికి తరుణి వినతి

కారుణ్య మరణానికి తరుణి వినతి

భువనేశ్వర్: ‘నేను చనిపోతా..దయచేసి అనుమతివ్వండి ’అని ఒడిశాకు చెందిన శీతల్ చేస్తున్న వినతి అందరి కంటాతడి పెట్టిస్తోంది. ఒడిశా భద్రక్ జిల్లాకు చెందిన శీతల్ జీవితం 2018 జులై 19 వరకు ఎన్నో ఆశలతో సాఫీగా సాగింది. నిరుడు జులై 19న పాఠశాల నుంచి తన సోదరి, స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్పుకొంటూ ఇంటికి తిరిగిళ్తున్నపుడు వేగంగా వచ్చిన ట్రక్కు వారిపై నుంచి దూసుకెళ్లింది. శీతల్ సోదరి అక్కడికక్కడే మృతి చెందంది. ఆమె తీవ్రంగా గాయపడింది. అప్పట్నుంచి తన పనులకు తల్లిదండ్రులపైనే ఆధారపడి జీవిస్తోంది. ఆదుకుంటామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అలాగే ఉంది. శీతల్కు చికిత్స అందించే ఆర్థిక స్థోమత ఆమె తల్లి దండ్రులకు లేదు. ఇక జీవితంపై అన్ని ఆశలు వదులుకున్న శీతల్ మరణమే శరణ్యమని భావించింది. తనకు కారుణ్య మరణానికి అనుమతివ్వాలని దరఖాస్తు చేసుకుంది. జీవితం చివరి అంకంలో ఉన్న రోగుల కారుణ్య మరణాలకు అనుమతిస్తూ 2018 మార్చి 9న సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వైద్యం లేని రోగాల బారిన పడిన వారు, ఎప్పటికీ కోలుకోలేని స్థితిలో ఉన్న వారు చని పోయేందుకు చట్టబద్ధత కల్పించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos