టీకాల ఎగుమతిని ఆపండి

టీకాల ఎగుమతిని ఆపండి

న్యూ ఢిల్లీ: దేశ రాజధానికి అదనపు కొవాగ్జిన్ మోతాదుల్ని సరఫరా చేయలేమని భారత్ బయోటెక్ నిస్సహాయత వ్యక్తం చేసినట్టు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. కేంద్ర అధికారుల ఆదేశాలు ఇందుకు కారణమని వివరించినట్లు చెప్పారు. పరోక్షంగా టీకాల సరఫరాను కేంద్రం నియంత్రిస్తోందని విమర్శించారు. కొవాగ్జిన్ నిల్వ అయిపోవటంతో 17 పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన సుమారు 100 టీకా కేంద్రాలు మూత పడ్డాయని తెలిపారు. కేంద్రం యావద్దేశాన్ని పాలించే ప్రభుత్వంగా వ్యవహరించాలి. తన బాధ్యతను గుర్తెరిగి, అన్ని ఎగుమతులు నిలిపివేయాలని వరుస ట్వీట్లలో డిమాండ్ చేశారు. రెండు వ్యాక్సిన్ తయారీ కంపెనీల ఫ్యార్ములాను ఇతర కంపెనీలతో పంచుకుని పెద్దఎత్తున టీకాల ఉత్పత్తి జరపాలన్నారు. ఇండియాలో వినియోగానికి వీలుగా అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని, మూడు నెలల్లో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వాల్సిందిగా రాష్ట్రాలకు ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos