వాహనదారులకు కలెక్టర్ వార్నింగ్..

వాహనదారులకు కలెక్టర్ వార్నింగ్..

కరోనా నియంత్రణలో భాగంగా తెలంగాణలో లాక్‌డౌన్‌ విధించినా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సాధ్యమైనంత వరకు ఇళ్లకే పరిమితం కావాలని సూచించినా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో సైతం ప్రజలు ఇదేవిధంగా రోడ్లపైకి రావడంతో పరిస్థితిని చూసిన కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆగ్రహానికి గురయ్యారు.అవసరం లేకున్నా కొందరు రోడ్లపై తిరుగుతూ కనిపించడాన్ని గుర్తించిన కలెక్టర్ వారిపై మండిపడ్డారు. స్వయంగా సిరిసిల్ల పట్టణంలో కలియదిరుగుతూ పర్యవేక్షణ చేసిన కలెక్టర్ అనేకమంది వాహనదారులకు క్లాస్ తీసుకున్నారు. అత్యవసరమైతేనే బయటికి రావాలని, లేకపోతే కఠినచర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వాహనాలను ఆపి మరీ హెచ్చరించారు. బైక్ పై ముగ్గురు రావడాన్ని గుర్తించిన కలెక్టర్ వారిని ఆపి తీవ్రస్వరంతో మందలించారు. వెనక్కి వెళ్లిపోవాలంటూ ఆదేశించారు. కలెక్టర్ రౌద్రావతారాన్ని దూరం నుంచే గమనించిన మరికొందరు వాహనదారులు అట్నుంచి అటే వెనక్కి మళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos