కేర‌ళలో వేడి దంచుతోంది

కేర‌ళలో వేడి దంచుతోంది

తిరువనంతపురం: కేరళ లో ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరిగాయి. దీంతో ఆ రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆరు జిల్లాలకు ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. ఎర్నాకుళం, త్రిసూర్, కన్నూరు, అలప్పుజా, కొట్టాయం, కోజికోడ్ జిల్లాల్లో సోమ, మంగళ వారాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు ఐఎండీ వెల్లడించింది. అలర్ట్ ప్రకారం ఎర్నాకుళం, త్రిసూర్, కన్నూరు జిల్లాల్లో అత్యధికంగా 37 డిగ్రీల టెంపరేచర్ నమోదు కానున్నది. ఇక అలప్పుజా, కొట్టాయం, కోజికోడ్ జిల్లాల్లో 36 డిగ్రీలు నమోదు కానున్నట్లు ఐఎండీ తెలిపింది. సాధారణ స్థాయి కన్నా సుమారు 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు ఆ జిల్లాల్లో నమోదు కానున్నట్లు ఐఎండీ తన అలర్ట్లో పేర్కొన్నది. నిజానికి మార్చి నుంచి జూన్ మధ్య కాలంలో కేరళలో అధిక ఉష్ణోగ్రతలే ఉంటాయి. కానీ ఈసారి ఫిబ్రవరిలోనే వెదర్ వేడెక్కినట్లు తెలుస్తోంది. వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు తగిన చర్యలు తీసుకోవాలని కేరళ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ పేర్కొన్నది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos