టీవీలో శివాజీకి అవమానం

టీవీలో శివాజీకి అవమానం

ముంబై : నటుడు అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా ఒక టీవీలో ప్రసారమవుతున్న కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమంలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీకి తగినంత గౌరవాన్ని ఇవ్వలేదని నెటిజన్లు ఆగ్రహించారు. ఆ టీవీ చానెల్, కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్ర మాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. నవంబర్ ఆరున ప్రసారమైన కేబీసీ ఎపిసోడ్లో మొఘల్ సామ్రాట్ ఔరంగ జేబ్కు సమకాలికుడు ఎవరు? అనే ప్రశ్నకు సమాధానంగా నాలుగు ఐచ్ఛికాల్నిచ్చారు.అవి..మహారాణా ప్రతాప్, మహా రాజా రంజిత్ సింగ్, రాణా సంగా, శివాజీ. అయితే మొదటి ముగ్గురి రాజుల పేర్లకు ముందు వారి బిరుదుల్ని చేర్చారు. శివాజీకి బిరు దు చేర్చలేదని నెటిజన్లు ఆక్షేపించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అని ఐచ్చికాన్ని ఇవ్వకుండా అవమానించారని మండి పడ్డారు. హిందూ ఆలయాల్ని కూల్చేసిన ఔరంగజేబుకు మెఘల్ సామ్రాట్ అనే బిరుదును ఎలా పెట్టారని ఒకరు విమర్శిం చారు. శివాజీని దక్షిణ భారత సింహంగా ఔరంగజేబు అభివర్ణించారు. అదీ ఆయన గొప్పతనమని మరొకరు వ్యాఖ్యానించారు. హిందూ సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపించిన వీరుడిని అగౌర పరచడం, అవమానించటం దారుణం. దీనివల్ల భవిష్యత్ తరాలకు ఏం నేర్పుతున్నామని ఘాటుగా ప్రశ్నించారు. దీనిపై తక్షణం స్పందించిన టీవీ యాజమాన్యం ట్విటర్లో క్షమాపణలు చెప్పింది. మరుసటి రోజు గురు వారం ఆ కార్యక్రమంలో క్షమాపణల్ని స్క్రోలింగ్ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos