రేకుల షెడ్డు వ్యయం రూ.8 కోట్లా

రేకుల షెడ్డు వ్యయం రూ.8 కోట్లా

అమరావతి: ‘ప్రజా వేదిక నిర్మాణానికి రూ.ఎనిమిది కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. తీరా ఇక్కడ చూస్తే మాత్రం అది రేకుల షెడ్డులా కనిపిస్తోందని రాష్ట్ర సమాచార శాఖా మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. బుధవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. అక్రమ నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజాధనాన్ని వృథా చేసిందని దుయ్యబట్టారు. చంద్ర బాబు నాయుడు తన అక్రమ నివాసాన్ని కాపాడుకునేందుకే ప్రజా వేదికను నిర్మించారని ఆరోపించారు. చట్టాల పట్ల ఆయనకు ఏమాత్రం గౌరవం లేదని విమర్శించారు. జాతీయ హరిత న్యాయ పంచాయతి ఎన్జీటీ) నిబంధనల్ని బాబు ముఖ్యమంత్రిగా ఏనాడు చిత్తశుద్దితో అమలు చేయలేదని ధ్వజమెత్తారు. ప్రజావేదికలో ఉన్న విలువైన పరికరాలను మళ్లీ వాడుకునేందుకు అధికారులు వాటిని బయటకు తరలించారని పేర్కొన్నారు. సాధ్యమైనంతవరకు నష్టాన్ని తగ్గించేలా చూస్తున్నామన్నారు. కృష్ణా నది కర కట్టపై ఉన్న అక్రమ నిర్మాణం ప్రజావేదికను కూల్చి వేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మంగళవారం ఉన్నత న్యాయ స్థానంలో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణకు న్యాయస్థానం తిరస్కరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos