నిరుద్యోగుల కోసం షర్మిల దీక్ష

నిరుద్యోగుల కోసం షర్మిల దీక్ష

హైదరాబాద్:ఇక్కడి ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద వైఎస్ షర్మిల గురువారం దీక్ష ప్రారంభమైంది. తెలంగాణలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేసారు. దీక్షను 72 గంటల పాటు నిర్వహించాలని భావించారు. గురువారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నిర్వహించుకోవడానికి పోలీసులు అనుమతినిచ్చారు. దీంతో ఆమె ఎప్పటివరకు దీక్ష చేస్తారన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తానని ఇటీవల నిర్వహించిన ఖమ్మం సభలో షర్మిల ప్రకటించిన విషయం విదితమే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos