కష్టాల నుంచి కసిగా!

కష్టాల నుంచి కసిగా!

‘‘ఒక ఆటగాడికి ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైనపుడు.. అతడి ముందు రెండు దారులుంటాయి. ఒకటి.. అతను ఆ ఉదంతం ప్రభావంతో పాతాళానికి పడిపోవచ్చు. లేదా దాన్నుంచి పాఠం నేర్చుకుని మరింత ఉన్నత స్థితికి చేరొచ్చు’’.. టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి న్యూజిలాండ్‌తో మూడో వన్డే అనంతరం విలేకరుల సమావేశంలో అన్న మాటలివి. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి కొన్ని మ్యాచ్‌ల సస్పెన్షన్‌కు గురై, న్యూజిలాండ్‌తో మూడో వన్డేకు పునరాగమనం చేసిన హార్దిక్‌ పాండ్య గురించి మాట్లాడుతూ అతనీ వ్యాఖ్యలు చేశాడు. పాండ్య.. కోహ్లి మాటల్ని ఏమాత్రం అనుసరిస్తాడు, మున్ముందు అతడి ఎదుగుదల ఎలా ఉంటుందో కానీ.. మహ్మద్‌ షమి మాత్రం కోహ్లి మాటలకు ఒక చక్కటి ఉదాహరణలా కనిపిస్తున్నాడు. గాయంతో ఏడాదిన్నర ఆటకు దూరం.. కోలుకుని మళ్లీ మైదానంలోకి వచ్చినా ప్రదర్శన అంతంతమాత్రం.. జట్టులో చోటు నిలవడమే కష్టంగా మారింది.. అలాంటి తరుణంలోనే గోరుచుట్టుపై రోకటి పోటులా వ్యక్తిగత జీవితంలో పెద్ద కుదుపు.. భార్య గృహ హింస కేసు పెట్టింది.. ఎన్నో అభియోగాలు మోపింది.. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలూ చేసింది.. ఇంకేముంది జట్టులో చోటు గల్లంతు.. ప్రమాదంలో కెరీర్‌! పది నెలలు గడిచాయి. ఇప్పుడతను జట్టులో అత్యుత్తమ బౌలర్లలో ఒకడు.. అటు టెస్టుల్లో, ఇటు వన్డేల్లో నిలకడగా రాణిస్తున్నాడు. జట్టు విజయాల్లో కీలకమవుతున్నాడు.  అతడిని వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ప్రధాన అస్త్రాల్లో ఒకడిగా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos