దేశం కానుంది మరో శహీన్‌ బాగ్‌

దేశం కానుంది మరో శహీన్‌ బాగ్‌

జైపూర్ :నూతన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర రిజిస్టర్ పట్టికకు వ్యతిరేకంగా న్యూఢిల్లీ షహీన్ బాగ్ నిరసన తరహాలో త్వ ర లో దేశం అంతటా జరగనున్నాయని నటి నందితా దాస్ శుక్రవారం ఇక్కడ జరిగిన సాహిత్యోత్సవంలో పేర్కొన్నారు.‘ అక్కడి వారంతా ఈ విధంగా వీధుల్లోకి వచ్చి నిరసన తెలపడం వెనుక ఏ రాజకీయ పార్టీ ప్రమేయమూ లేదు. సీఏఏ, ఎన్ఆ ర్సీపై విద్యార్థులు, సాధారణ ప్రజలు చేస్తున్న నిరసనను అభినందించాలి. నాలుగు తరాలుగా ఇక్కడే నివసిస్తున్నట్లు నిరూపిం చుకోవాలని ప్రభుత్వం కోరడం చాలా బాధాకరం. అందువల్ల ప్రతి ఒక్కరూ దీనిపై మాట్లాడాలి. యువత దేశంలో ఓ ఆశను సృ ష్టిం చింది. ఇప్పుడు దేశంలో ఇతర ప్రాంతాలు కూడా శహీన్ బాగ్ కాబోతున్నాయి. మనుషులు అన్న ప్రతి ఒక్కరూ ఈ చట్టా లకు వ్యతిరేకంగా మాట్లాడాలి. పాలకులు ప్రజలను మతాల ప్రాతిపదికన విడగొడుతున్నారు. దేశంలో గత 50 ఏళ్లలో ఎన్న డూ ఇప్పుడు ఎదుర్కొంటున్న నిరుద్యోగితను చూడలేదు. ఆర్థిక క్షీణత పెరుగుతోంది. అంతర్జాతీయ పత్రికలన్నీ భారత్లో ఏం జరు గు తుందని కథనాలు రాస్తున్నాయి. మతాల ప్రాతిపదికను విడగొట్టడం ఇదే తొలిసారి. సమానత్వ హక్కు అనేది మన రా జ్యాం గం ఇచ్చింది. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ లింగమైనా రాజ్యాంగం ప్రకారం సమానమే. ఆ విషయాన్ని నమ్మిన వాళ్లు ఎవ్వరూ ఇలా మత ప్రాతపదికన వేరుచేయడాన్ని అంగీకరించర’ని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos