సర్పంచుల అరెస్టుపై ఎంపీల మండిపాటు

సర్పంచుల అరెస్టుపై ఎంపీల మండిపాటు

ఢిల్లీ : జగిత్యాలలో సర్పంచులను అరెస్టు చేయడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భాజపా ఎంపీలు అర్వింద్, బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం వారిక్కడ మీడియాతో మాట్లాడుతూ నిన్న జగిత్యాలలో 380 మందికి పైగా సర్పంచులను అరెస్టు చేశారని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తెలిపారు. ఇది ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమేనన్నారు. సర్పంచ్, కార్యదర్శికి ఉన్న చెక్ పవర్ ఉప సర్పంచ్‌కు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సర్పంచులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బండి సంజయ్ అన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ ప్రవర్తనను మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వ అధికారి,  అధికార పార్టీకి కొమ్ముకాయడం సరికాదని హితవు పలికారు. స్వచ్ఛభారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణంలో సర్పంచులపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందన్నారు. ఒప్పుకోని సర్పంచులను అరెస్టు చేయిస్తోందని ఆరోపించారు. మరుగుదొడ్లు, ఎల్ఈడీ బల్బుల అంశంలో అవినీతి జరిగిందని ఆరోపించారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos